మహర్షి తర్వాత మహేష్‌బాబు కొత్త ప్రాజెక్ట్ ఏంటి? ఏ డైరెక్టర్‌తో సెట్స్‌పైకి వెళ్తున్నాడు? ఫిల్మ్ సర్కిల్స్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతున్న చర్చకు దాదాపు బ్రేక్ పడినట్టే! డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రిన్స్ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త‌న ట్విట్టర్‌లో ‘నెంబ‌ర్ 5.. లోడింగ్‌’ ఈ విధంగా రాసుకొచ్చాడు దర్శకుడు. అంటే త‌న ఐదో సినిమాకి సంబంధించిన ప‌నులు మొద‌లు పెట్టినట్టు అర్థమవుతోంది. మహర్షి పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానున్నట్టు అంతర్గత సమాచారం.

ప్రిన్స్ పక్కన ఈసారి ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒకరు ర‌ష్మిక మంథాన కాగా, మరొకరు అదితిరావ్ హైద‌రి.. ఇందులో మెయిన్ రోల్ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2020లో విడుద‌ల కానున్న దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తొలుత రచయితగా కెరీర్ మొదలుపెట్టిన అనిల్, ఆ త‌ర్వాత ద‌ర్శకుడిగా మారాడు. ప‌టాస్‌ నుంచి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఫ‌న్ అండ్ ఫ్రస్ట్రేష‌న్ వంటి సినిమాలతో వరసగా బాక్సాఫీసు వద్ద విజయాలను నమోదు చేశాడు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *