టీడీపీ నేతలకు మరో పెద్ద షాక్ తగిలింది. ప్రధాన పార్టీల టిక్కెట్ దక్కడమే గగనమైన ఎన్నికల వేళ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థులు.. ఆ టిక్కెట్ ను పార్టీ అధినేత మొఖంమీద విసిరికొట్టి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ అనుభవం ఎలా ఉంటుందో టీడీపీ పెద్దలు రుచిచూస్తున్నారు. ఇటీవలే నెల్లూరు రూరల్ టిక్కె్ట్ దక్కిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇదే పనిచేసి వైసీపీలో చేరిపోతే, తాజాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం టిక్కెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి సీటొద్దు.. రాజకీయాల నుంచే తాను తప్పుకుంటున్నానని ఒక బాంబు పేల్చారు. తన భార్య అనారోగ్యంతో ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. 2014లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ఆయన టీడీపీలోకి జంప్ చేశారు.

ఇలా ఉండగా, ఇవాళ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. టికెట్ ఇచ్చి గౌరవిస్తే, పార్టీ ఫిరాయించారని.. స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *