సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇకనైనా నోరువిప్పి జగన్ చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి జగనే అతి పెద్ద సమస్య అన్న చంద్రబాబు.. జగన్ అక్రమ వ్యవహారాలన్నీ అప్పట్లో కూలంకషంగా చవిచూసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్నారని.. ఇప్పుడైనా లక్ష్మీనారాయణ నోరు విప్పి జగన్ గురించి అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలన్నారు. లక్ష కోట్లు దోచుకున్న ఘనుడు జగన్ అని చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు.

ఈ ఐదేళ్లు, అంతకుముందు కూడా జగన్ గురించి అందరికీ తెలుసని, తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు జగన్ దోచాడని చెప్పారు. వాళ్లింట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు. అది కుటుంబంలో జరిగిన హత్యేనని.. సాక్ష్యాలు తారుమారు చేయడానికి రక్తపు మరకలన్నీ కడిగేసి బెడ్ షీట్లు మార్చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *