ఏపీ త్వరలో ఆటోమొబైల్ పరిశ్రమకు హబ్‌గా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపు రేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం కియా తొలి కారును ఆయన ప్రారభించారు. అనంతపురం ప్లాంట్‌లో మొదటి కారు  వచ్చే జనవరిలో బయటకు వస్తుందని చంద్రబాబు తెలిపారు. కియా కంపెనీ ఇక్కడ తయారు చేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారని, మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎదుమతి చేస్తారని ఆయన వెల్లడించారు. విద్యుత్ చవకగా మారేందుకు సౌర విద్యుత్ ఒక్కో యూనిట్ రూ. 1.50 లకే లభ్యమయ్యేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సచివాలయంలో ఈ కారుతో బాటు చార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా..నీరో హైబ్రిడ్, నీరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నీరో ఎలక్ట్రిక్ కార్లను ఏపీ ప్రభుత్వానికి ఈ సంస్థ బహుమతిగా అందజేసింది. వీటిని ఒకసారి చార్జి చేస్తే 455 కి.మీ. ప్రయాణించగలవని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *