ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి చెన్నై 1040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1210 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఇది తుపాన్‌గా మారనుంది. తదుపరి 24 గంటల్లో పెనుతుపాన్‌గానూ మారే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగుగాలులు వీయనున్నాయి. దీని ప్రభావం కారణంగా శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

 

అటు తుపాన్ ప్రభావం తెలంగాణపైనా పడింది. గురువారం రాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన వర్షం రాత్రంతా కురిసింది. సికింద్రాబాద్‌, బేగంపేట, సనత్‌నగర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, ఎల్‌బీనగర్‌, మెహిదీపట్నం, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గురువారం మధ్యాహ్నం నుంచే నగరం మేఘావృతమై ఉండి వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాత్రి వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడగా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. శుక్రవారం ఉదయం కూడా వాతావరణం అలాగే వుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *