ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలకు సంక్రాంతి పండుగను రెండురోజుల ముందే తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది లబ్ధి పొందేలా పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి పెంచిన పింఛన్ లు అందిస్తారు. లబ్దిపొందనున్న పింఛనుదారులలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు తదితరులున్నారు. వీరందరికీ అందజేసే పింఛన్లను రూ.2000లకు పెంచారు. చంద్రబాబు నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జువ్వెలదిన్నె జన్మభూమిలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు మరికొన్ని వరాలు ప్రకటించారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమం మనకు నిజమైన పండుగన్నారు. పసుపు, కుంకుమ పేరుతో మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని.. వీటి జారీలో అవినీతికి చోటు లేకుండా చేశామన్నారు. రక్ష పేరుతో బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ ఇస్తున్నామని.. గ్రామసభల నిర్వహణలో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

ఫిబ్రవరి నెల నుండి 12 రకాల పెన్షన్లలను రెట్టింపు చేసిన క్రమం ఇలా ఉంది..

1) వృధ్యాప్త పెన్షన్ వెయ్యి రూ రెండువేలకు పెంపు

2) వితంతు పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

3) చేనేత పెన్షన్ వెయ్యినుండి రెండు వేలకు పెంపు

4) మత్స్యకారులు పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

5) కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

6) డప్పు కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

7) గీతకార్మికుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

8) ఒంటరి మహిళల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

9) ట్రాస్ జెండర్స్(హిజ్రాలు) పెన్షన్ రూ 1,500 నుండి 3,000 కు పెంపు

10) చర్మతోలు వృత్రి దారుల పెన్షన్ 1,500 నుండి 3,000 కు పెంపు

11) వికలాంగుల పెన్షన్ 1,500 నుండి 3000 లకు పెంపు

12) డయాలసిస్(కిడ్నీ వ్యాధిగ్రస్తుల)పెన్షన్ 2,500నుండి 5,000 కు పెంపు.

పెంచిన పెన్షన్ల పంపిణితో ఏపీలో దాదాపు 54,00,000 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్లరూపాయలు.. సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు.. ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు వ్యయం కానుంది. అంటే.. ఈ మొత్తం మేఘాలయ, అస్సోంలాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ అన్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *