యాక్షన్‌పార్ట్‌లో దిగిన బాబు!

నాలుగు తాత్కాలిక భవనాలు మినహా అమరావతి నిర్మాణం ముందుకు కదల్లేదన్న అభియోగాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మేలుకున్నట్టున్నారు. ఎన్నికల వేడి కూడా మొదలైపోవడంతో ‘అదిగదిగో అమరావతి’ అంటూ జనానికి చూపెట్టడానికి ఏదైనా ఉండాలి కనుక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పని మొదలుపెట్టేశాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2020 నాటికి అమరావతి ఫస్ట్ ఫేస్ సిద్ధమవుతుందంటున్నారు సీఎం చంద్రబాబు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో భేటీ అయిన బాబు అండ్ కో.. అమరావతి స్టార్టప్‌ ఏరియా ‘ఫేజ్‌ జీరో’ అభివృద్ధిపై సింగపూర్‌ కన్సార్షియంతో అవగాహన కుదుర్చుకున్నారు. సింగపూర్‌తో కలిసి పనిచేయడం గర్వకారణమని, 2020 నాటికి హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల మొదటి వారంలోగా విజయవాడ – సింగపూర్ విమాన సర్వీసులు మొదలవుతాయని కూడా చెప్పారు.