కొడుకు లోకేష్‌కి ఎన్నికల సమయంలో ‘మంచి డ్యూటీ’ అప్పగించారు.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద ప్రశంసలు పడిపోతున్నాయి. తాను మాత్రం కాలికి బలపం కట్టుకుని.. రాష్ట్రం మొత్తం తిరిగేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చంద్రబాబు.. కొడుకుని మాత్రం ‘మంగళగిరి’కి మాత్రమే పరిమితం చేసి మంచి పని చేశారా? తెలుగుదేశం శ్రేణుల్లో ఒక వర్గం ఈ మేరకు సంతృప్తి వ్యక్తం చేస్తోంది.

లోకేష్ పెర్ఫామెన్స్ లెవెల్స్‌ని  కొలవడానికి ‘మంగళగిరి’ ఫలితం ఒక కొలబద్దగా పనికొస్తుందని తెలుగుదేశం పెద్దల అంచనా. అందుకే.. పదిరోజులుగా మంగళగిరి పరిధి దాటి బైటికి రాలేకపోయాడు లోకేష్. పోలింగ్ తేదీ దాకా మంగళగిరిలోనే లోకేష్ బస. వీధివీధీ తిరిగి.. అన్ని వర్గాల వారినీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నాన్న చేసిన కొన్ని తప్పుల్ని కూడా ‘కడిగేసుకోవాల్సిన’ అవసరం వచ్చింది లోకేష్‌కి.

ఇటీవల నాయీ బ్రాహ్మణుల్ని చంద్రబాబు బహిరంగంగా దూషించినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ‘ఎక్కువ చేస్తే కత్తిరించేస్తా..’నంటూ జీతాల విషయంలో చంద్రబాబు హెచ్చరించడం.. పార్టీకి డ్యామేజ్ చేసింది. ఇప్పుడు సదరు సామాజికవర్గం ఓటు బ్యాంకును చేజిక్కించుకునేందుకు లోకేష్ కసరత్తు చేస్తున్నారు. నేనూ మీవాడినే అంటూ.. కత్తెర చేతపట్టి.. క్షవరం చేస్తూ.. ఫోటోలకు ఫోజిచ్చారు లోకేష్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *