నరసరావుపేట ఎంపీ సీటు తనకు, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టిన సీనియర్ నేత రాయపాటి మెత్తబడినట్టు కనిపిస్తోంది. మొదట నరసారావు పేట లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాకపోవడంతో ఆయన అలిగినంత పని చేశారు. ఈ స్థానానికి భాష్యం రామకృష్ణ పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో రాయపాటి బ్రదర్స్‌కు వైసీపీ నుంచి ఫోన్లు వెళ్లాయని, తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు ఆ పార్టీవైపు చూడవచ్చునని కూడా వార్తలు హల్చల్ చేశాయి. అయితే మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించినట్టు సమాచారం. దీంతో ఆయన మెత్తబడినట్టు తెలుస్తోంది. సిఎం చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనతో అన్ని విషయాలు చర్చించానని రాయపాటి ఆ తరువాత తెలిపారు. ప్రస్తుతానికి రాయపాటి పార్టీ మారకపోవచ్చునని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *