ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన దవళ అర్జున్ రావు అనే వ్యక్తి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్ పై సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని నుంచి తెలుగులో రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ధర్మ పోరాట దీక్షలో ఉన్న సీఎం చంద్రబాబు దీక్షాస్థలి లోనే సంతాపం ప్రకటించారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని కోరారు. అర్జున్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *