జస్ట్..బంకమట్టిని వేడి చేసి చేత్తో తయారు చేసిన పాటరీ (కుండలు, పాత్రలు వగైరా) బయటపడడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి అవి ఈ నాటివా ? ఏనాడో దాదాపు 2 వేల సంవత్సరాల నాటివి.. అయినా..చెక్కుచెదరకుండా కనిపించాయి. వీటితో బాటు డెడ్ సీ దగ్గరి గుహలలో నాటి స్క్రోల్స్ (పురాతన గ్రంథాలు) కూడా కనబడి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

జెరూసలెం పాత నగరం దగ్గరి కుమ్రాన్ సెటిల్మెంట్ అది.. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలుసుకుని హీబ్రో యూనివర్సిటీ పరిశోధకులు..కొందరు ఇజ్రాయెలీ లేబర్ తో కలిసి ఆ గుహలను పరిశీలించారు. వీటిలో యూదులకు సంబంధించిన మ్యాన్యు స్క్రిప్టు లు కూడా ఉన్నాయి. వీటిని కేంబ్రిడ్జి యూనివర్సిటీ లైబ్రరీకి తరలించగా అక్కడి విద్యార్థులు, టీచర్లు ఆసక్తిగా అధ్యయనం చేశారు.

వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఒకనాడు అపారమైన సహజ వనరులు గానీ అమూల్యమైన ఖనిజాలు గానీ ఉండేవా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

ఆశ్చర్యంగా 1611 లో నాటి కింగ్ జేమ్స్ రూపొందించిన బైబిల్ ని కూడా ఈ పరిశోధకులు గమనించారు. దీన్ని వాషింగ్టన్ లో ప్రదర్శనకు ఉంచారు. 300 బీసీ నాటి పాటరీ, ఇతర గ్రంథాలతో బాటు ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ‘ వెలుగు లోకి ‘ వచ్చాయి.

1967 ప్రాంతంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరాటం, ఘర్షణలు జరిగాయని, నాడు పాలస్తీనా ప్రభుత్వం అనుమతి లేనిదే ఈ గుహలను పరిశీలించడానికి వీలు లేకపోయిందని, అయితే 1993 లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓస్లో ఒప్పందంపై సంతకం చేశాక పురాతత్వ సర్వేకు అవకాశం లభించిందని చెబుతున్నారు.

ఈ స్థలాల్లో..కేవ్ 53 గా గుర్తించిన గుహ..ఈ తవ్వకాలకు సాక్షిగా నిలిచింది. మరిన్ని ‘ పవిత్ర గ్రంథాలు ‘ కూడా భవిష్యత్తులో జరిపే తవ్వకాల్లో బయటపడవచ్చునని భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *