ఆ నలుగురిలో ఒకరికి ప్రిన్స్ బంపరాఫర్

‘భరత్ అనే నేను’ మూవీ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో వున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. రెండు డిజాస్టర్స్ తరువాత సరైన హిట్ కొట్టడంతో అభిమానులు డబుల్ హ్యాపీ. ఇదిలావుండగా నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ప్రిన్స్ సెట్స్ పైకి వెళ్తున్నాడు.. అన్నదే బిగ్ క్వొశ్చన్. ఇప్పటికైతే మహేష్ తో మూవీ చేసేందుకు చాలామంది డైరెక్టర్లు లైన్ లో వున్నారు. వారిలో సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, సందీప్ వంగ మొదటి వరసలో వున్నారు.

అర్జున్ రెడ్డి హిట్ కావడంతో దర్శకుడు సందీప్ ని ప్రిన్స్ అప్రోచ్ అయినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. మరి ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదుగానీ.. రంగస్థలం హిట్ కావడంతో మహేష్ చూపు సుకుమార్ మీదకి మళ్లింది. మహేష్ #26కి సుకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఆ తర్వాత వంశీ, త్రివిక్రమ్ కి ఛాన్స్ దక్కవచ్చు. ఫైనల్ గా సందీప్‌కి లాంగ్ వెయిట్ తప్పకపోవచ్చు. రెండుమూడేళ్లు ఆగితే తప్ప సందీప్‌కి ప్రిన్స్‌ నుంచి కాల్షీట్లు దొరకవన్నమాట.