హవాయ్ దీవుల్లో సముద్ర జీవులపై పరిశోధనలు జరుపుతున్న బృందానికి ఓ విచిత్రమైన దృశ్యం కనబడింది. ఓ చిన్న సీల్ ముక్కులో చిక్కుకున్న ‘ఈల్’ చేప సజీవంగానే ఉండి బయటపడలేక అవస్థలు పడుతుండగా.. సీల్ పరిస్థితి కూడా అలాగే చాలాసేపు కంటిన్యూ అయింది.

ఈ బృందం అతి కష్టం మీద ఆ సీల్ ముక్కు భాగం నుంచి ఈల్ ను బయటికి తీయగలిగారు. ఈ క్రమంలో ఈల్ మరణించగా..సీల్ మాత్రం ప్రాణాలతో బతికి బయటపడింది. ముఖ్యంగా హవాయ్ దీవుల సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపించే ‘ హవాయిన్ మాంక్ ‘ సీల్ జీవులకే ఈ పరిస్థితి తలెత్తడం రీసెర్చ్ బృందానికి ఆశ్చర్యం కలిగించింది.

గత 40 ఏళ్ళలో ఇలాంటి సంఘటనలు అయిదారు సార్లు బయటపడ్డాయి. ఇది మరీ విడ్డూరంగా ఉందని అంటున్నారు. సాధారణంగా సీల్స్ వంటివి తమ ఎర కనబడగానే నోటితో స్వాహా చేస్తాయి. కానీ.. ఈ పిల్ల సీల్ నోటికి కాక ముక్కు లోకి ఈల్ ఎలా చొరబడిందో సముద్ర జీవులమీద పరిశోధనలు చేస్తున్న బృందానికి అంతు పట్టడంలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *