న్యూజెర్సీలో ఎన్నారై మహిళలు ఆడి పాడి సందడి చేశారు. వుమెన్స్ డే కార్యక్రమంలో హల్చల్ చేసారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించిన ఈవెంట్లో ఫ్యాషన్ షో, సినిమా పాటలకు స్టెప్పులతో కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు.

అమెరికా వ్యాప్తంగా 16 నగరాల్లో జరుగుతున్న ఆటా మహిళా దినోత్సవాలు న్యూజెర్సీలోనూ అదే జోష్ తో ముగిశాయి. 2013లో రెండుమూడు సిటీస్ తో మొదలుపెట్టిన ఉమెన్స్ డే వేడుకలు ఇప్పుడు దాదాపు 20 నగరాలకు విస్తరించాయని, వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆటా ప్రతినిధులు చెప్పారు.


అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ఇంకా.. శివాని అయిత, ఇందిర, మాధవి అరు తదితరుల పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు ఐదు వందల మంది పాల్గొన్న ఈ వేడుకలు ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *