‘ఈసారి మాట తప్పితే ఇదే చెప్పుతో కొట్టు’ అంటూ ఒక పెద్దావిడ ఓటరు చేతిలో చెప్పు పెట్టబోయిన వైనాన్ని ఇటీవలి ఎన్నికల సందర్భంగా చూశాం. ఓట్లప్పుడు హామీలిచ్చి.. గట్టు దాటిన తర్వాత తూచ్ అనడం మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులకు అలవాటే. సరే.. వీళ్ళంతా అబద్ధానికి పుట్టిన అనాకారీ మనుషులు అని సర్దుకోవడం కూడా అలవాటైపోయింది మనకు. మరి.. విదేశాల్లో ఈ అబద్ధపు హామీల సంగతేంటి? ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పొలిటీషియన్ల మీద అక్కడి జనానికి వుండే అభిప్రాయమేంటి?

ఆస్ట్రేలియన్లు తమ నాయకులు చెప్పే మాటల మీద, ఇచ్చే హామీల మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారట. అక్కడి పొలిటీషియన్లు కూడా విశ్వసనీయతకు కాపాడుకోవడంలో ముందుంటారని, అత్యవసరమైతే తప్ప అబద్ధం చెప్పరని తేలింది. ఆస్ట్రేలియాతో పోలిస్తే అమెరికన్ పొలిటీషియన్లు పది రెట్లు ఎక్కువ అబద్ధాల కోరులన్నది ఇక్కడే తేలిన మరో ముచ్చట. అందుకే అమెరికా జనాభా.. అసలు తమ నాయకుల మాటల్ని పట్టించుకోవడమే మానేశారని, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత.. అక్కడి వాళ్లలో ఈ రకమైన భావన బాగా నాటుకుపోయిందని తెలుస్తోంది. అబద్ధాలాడడమే అలవాటుగా పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్.. ‘అబద్ధపు వార్తల’ అంతు చూస్తానంటూ హెచ్చరించడం ఒక వైపరీత్యం. సో.. అబద్ధానికుండే అర్థం, దానిమీద జనానికుండే అభిప్రాయం ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్.. ఆన్లైన్‌లో 450 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించి ఈ విషయాల్ని రాబట్టింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *