బాహుబలికి ప్రీక్వెల్ .. నెట్‌ఫ్లిక్స్‌లో..

వాల్డ్‌వైడ్ పాపులర్ మూవీ ‘బాహుబలి’ ప్రీక్వెల్ కి రంగం సిధ్ధమైంది. రెండు భాగాలుగా ఈ ప్రీక్వెల్ సిరీస్ రానున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. శివగామి ఎలా అంచెలంచెలుగా ఎదిగి మహారాణిగా మారిందో… ‘బాహుబలి..ది బిగినింగ్’ అనే ఈ సిరీస్‌లో చూపనున్నట్టు తెలిపింది. దర్శకధీరుడు రాజమౌళి.. ఒరిజినల్ ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ భాగస్వామ్యంతో ఈ ప్రీక్వెల్ ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.

ఫస్ట్‌ సీజన్‌లో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయని, ఇది సక్సెస్ అయితే పొడిగించే అవకాశం ఉంటుందని అంటున్నారు. దర్శకులు దేవాకట్టా, ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్‌కు కో-డైరెక్టర్లుగా వ్యవహరిస్తారట.. ఈ ఎమేజింగ్ స్టోరీని నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి భాగస్వామిగా తీసుకురానుండడం తమకెంతో సంతోషంగా ఉందని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాత ప్రసాద్ దేవినేని తెలిపారు.