ఆ చిన్నారి వయస్సు జస్ట్..10 రోజులు మాత్రమే..పుట్టడానికి ఆరోగ్యంగానే పుట్టినా.. తల్లి గర్భంలో కొన్ని డిజార్డర్ల కారణంగా ఆ పసిబిడ్డ బ్రెయిన్ డెడ్ అయింది.  దాదాపు మృత్యు ముఖంలో ఉన్న ఆ చిన్నారిని బతికించడానికి డాక్టర్లు చేయని ప్రయత్నమంటూ లేదు. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ పెట్టారు. కానీ అవేవీ పని చేయకపోవడంతో.. ఆ బాబు ఇక బతకడన్న నిర్ణయానికి వచ్చి..అతడ్ని కాపాడే అన్ని సిస్టమ్స్ ను తొలగించేశారు. అయితే.. అనూహ్యంగా ఆ చిన్నారి మళ్ళీ కళ్ళు తెరిచాడు.

తన తల్లి చేతి వేళ్ళను సుతారంగా తాకాడు. అంతే ! ఆ పసికందు తలిదండ్రుల ఆనందానికి అంతు లేకపోయింది. తమ బిడ్డ బతికాడని తెలిసి ఇది మిరాకిల్ అని అభివర్ణించారు. డాక్టర్లు కూడా ఈ ‘ మృత్యుంజయుడి ‘ మెడికల్ హిస్టరీ సుపర్బ్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ చిచ్చర పిడుగు వయస్సు 15 నెలలు.ఆరోగ్యంగా ..భేషుగ్గా ఉన్నాడు. బ్రెయిన్ డెడ్ అని చిన్నారిని  టెస్టిఫై చేసిన డాక్టర్లు ఇప్పటికీ ఆశ్చర్యం నుంచి తెలుకోలేకపోతున్నారు. ఇంతకీ..ఆ చిన్నారి పేరు కలెబ్ క్రూక్..పేరెంట్స్ బెకీ, ఫిల్ క్రూక్.. బ్రిటన్లో జరిగిందీ అరుదైన ‘ ఘటన ‘

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *