నంద‌మూరి బాల‌కృష్ణ ఇపుడు రాజ‌కీయ ర‌ణరంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఆయన హిందూపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మ‌రోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్న బాల‌య్య‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిష్ట‌ వేశారు. హిందూపూర్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున బాలయ్య ప్ర‌చారం చేయాల్సి ఉంది. సినిమా కెరీర్ పరంగా.. ఎన్టీఆర్ క‌థ‌నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాలు దారుణంగా ప‌రాజ‌యంపాలు కావ‌డంతో కొంత డీలా ప‌డ్డారు బాల‌య్య‌.

ప్ర‌స్తుతం బాలయ్యకు రాజ‌కీయాలు త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేదు. త‌న తర్వాతి మూవీ తీయాల్సిన బోయ‌పాటిని కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం తిప్పుతున్నాడు. ఇప్పుడు బోయ‌పాటి తెలుగుదేశం పార్టీ యాడ్స్ తీస్తున్నాడు. వీరిద్ద‌రూ ఎన్నిక‌ల త‌ర్వాతే ఫ్రీ అవుతారు. అంటే.. వీరి కొత్త సినిమా జూన్‌లోనే లాంచ‌నంగా మొద‌ల‌వుతుంది. మే 23న ఫలితాలు వెల్ల‌డి అవుతాయి. బాల‌య్య పుట్టిన రోజు జూన్ 10. సో.. బాల‌కృష్ణ – బోయ‌పాటి సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న కానీ, క్లాప్ ప‌డ‌డం కానీ బ‌ర్త్‌డే నాడు ఉండే ఛాన్సుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *