బాలకృష్ణను అరెస్ట్ చేయాల్సిందే.. బీజేపీ డెడ్ లైన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, బాలయ్య ప్రసంగం అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేయించి ఉండేవారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గతంలోనూ బాలకృష్ణ ఎన్నో దిగజారుడు పనులు చేశారని..అతను తాజాగా మోదీపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణను అరెస్ట్ చేయాలని, లేకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ హెచ్చరించారు.