సామాజిక న్యాయంకోసం పోరాడిన తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణా నిండా ఎగరాలని ఈ పార్టీ నేత, సినీ నటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి లోని వివేకానందనగర్ లో ప్రజాకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణాలో గడీల పాలనను టీడీపీయే అంతం చేసిందని, ఇక్కడ రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేవని బాలకృష్ణ దుయ్యబట్టారు. అమరవీరుల బలిదానాలతో తెలంగాణా ఏర్పడింది. అలాంటి  అమరవీరుల కుటుంబాలను ఈ ప్రభుత్వం విస్మరించింది అని ఆయన విమర్శించారు. తెలంగాణా అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర ఉంది.. కేసీఆర్ ఎన్నో కబుర్లు చెబుతున్నారు..టీడీపీ గురించి ఆయన కాకమ్మ కబుర్లు వల్లిస్తున్నారు.. చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీని మూసేసే దమ్ముందా.? ఫ్లై ఓవర్లు మాయం చేసే గట్స్ ఉన్నాయా..? శంషాబాద్  ఎయిర్ పోర్టును మూసి వేయగలుగుతారా అని బాలయ్య ఆవేశంగా ప్రశ్నించారు. చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగులు పెట్టుకుంటున్నారని, అయితే ఆయననే విస్మరిస్తున్నారని తూర్పార బట్టారు. హైదరాబాద్ కు దీటుగా సైబరాబాద్ ను చంద్రబాబు అభివృద్ది చేశారని పేర్కొన్న ఆయన.. టీడీపీలో గెలిచి తెరాసకు వలస పోయిన నమ్మకద్రోహుల భరతం పట్టాలని పిలుపునిచ్చారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *