నటుడు బాలకృష్ణకు ఈసారి  హిందుపురం నుంచి గట్టి పోటీ ఎదురైంది. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. భారీ ప్రదర్శనతో బయలుదేరిన బాలయ్య దంపతులు, సెంటిమెంట్ ప్రకారం హిందుపురం పట్టణంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. బడుగు బలహీన వర్గాల నుంచి టీడీపీ పుట్టిందని, అలాంటి పార్టీపై కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని చేసినా రాబోయేది తెలుగుదేశం ప్రభెుత్వమేనని కుండబద్దలు కొట్టేశారు.

150కిపైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో హిందూపురం నియోజకవర్గాన్ని మరో బెంగళూరు సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు బాలకృష్ణ మీద వైసీపీ అభ్యర్థిగా ఇక్బాల్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే!

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *