ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రతిష్టాత్మకంగా జరుగబోతోన్న వన్డే ప్రపంచకప్‌ (ఐసీసీ వన్డే) టోర్నమెంట్ కు ఇండియా టీంను ప్రకటించింది బీసీసీఐ. ఎమ్ఎస్‌కె ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. సమావేశం అనంతరం ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు. అయితే ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి స్థానం కల్పించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ప్రకటించిన జట్టు సభ్యుల వివరాలు ఈ కింది విధంగా ఇలా ఉన్నాయి.

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), ధోనీ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *