వైఎస్ బయోపిక్.. షర్మిల రోల్‌లో భూమికా ? లేదే !

దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయో పిక్ ‘ యాత్ర ‘ లో జగన్ సోదరి వై.ఎస్. షర్మిల పాత్రలో సీనియర్ నటి భూమిక నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవి వదంతులేనని, నిజం కాదని ఈ మూవీ డైరెక్టర్ మహి క్లారిటీ ఇచ్చారు. ‘ షీ (భూమిక) ఈజ్ నాట్ ఇన్ ది ఫిల్మ్ ‘ (ఆమె ఈ చిత్రంలో నటించడం లేదు) అని సింపుల్ గా చెప్పారు.

అతి కీలకమైన వైఎస్ పాత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రోల్ లో రావు రమేష్ నటిస్తారని ఇదివరకే ఈ మూవీ యూనిట్ తెలిపింది. మమ్ముట్టి ఈ చిత్రం కోసం అప్పుడే తన డేట్స్ ఇచ్చేశారు. ఇతర పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు మహి బిజీగా ఉన్నట్టు సమాచారం. జూన్ రెండో వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. వై.ఎస్.భార్య విజయలక్ష్మి, వారి కుమారుడు జగన్ పాత్రలకు ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది మహికి పెద్ద ఇష్యూగా మారిందని తెలుస్తోంది.