ఓ భారీ ఉల్క భూమిని దాదాపు తాకేందుకు దూసుకువస్తోంది. 2013 ఎండీ 8 అని వ్యవహరించే ఈ ఉల్క  ‘బిగ్‌బెన్’  సైజంత ఉంటుందని నాసా ప్రకటించింది. గంటకు 30, 420 మైళ్ళ వేగంతో ఇది వస్తోందని, భూమికి సుమారు 30 లక్షల మైళ్ళ దూరం వరకు వచ్చి కనుమరుగవుతుందని నాసా శాస్త్రజ్ఞులు వెల్లడించారు. 280 అడుగుల వైశాల్యం గల ఈ ‘స్పేస్ రాక్’  బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహానికి చేరువగా రానున్నట్టు వారు పేర్కొన్నారు.

ఒకవేళ ఈ ఉల్క భూమికి 46 లక్షల మైళ్ళ దూరం వరకు వచ్చిన పక్షంలో మనకు డేంజరేనని వారు భావిస్తున్నారు. దీని గమనాన్ని ట్రాక్ చేస్తున్నామన్నారు. ఉల్క లేదా తోకచుక్కల వల్ల మానవాళిలో ఎవరూ మరణించిన దాఖలా గత వెయ్యేళ్ళలో లేదు గనుక మనం నిశ్చింతగా ఉండవచ్చునట.  పైగా రానున్న వేలాది సంవత్సరాల్లో ఏ పెద్ద ఉల్క లేదా తోకచుక్క భూమిని ఢీ కొనే అవకాశాలు లేవని కూడా వారు భరోసా ఇస్తున్నారు.  ఏమైనా ఈ భారీ ఉల్కకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తామని నాసా ప్రకటించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *