విశాఖ ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి సిట్టింగ్ ఎంపీ హరిబాబును దూరంగా పెట్టింది బీజేపీ అధిష్టానం. అక్కడి నుంచి మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి బరిలోకి దిగారు. గతంలో రెండుసార్లు ఆమె కాంగ్రెస్ తరపున అక్కడి నుంచే విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గురువారం రాత్రి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. అందులో విశాఖ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆమెకి ప్రత్యర్థులు.. టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, వైసీపీ నుంచి రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ బరిలో వున్నారు.

ఈసారి గెలుపు కోసం పురందేశ్వరి తీవ్రంగానే కష్టపడాల్సి వుంటుందని ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెద్దగా బలంలేని బీజేపీకి.. గత ఎన్నికల్లో విశాఖ సిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామన్న ఒక్క అంశం మీద మాత్రమే పురందేశ్వరి బరిలోకి దిగుతున్నారు. నిజానికి విజయవాడ నుంచి పురందేశ్వరి బరిలోకి దిగుతారని ఆమె మద్దతుదారులు చివరివరకు భావించారు. అక్కడ వైసీపీ పీవీపీకి టికెట్ ఇచ్చింది. ఇక విశాఖ సీటు విషయంలో బీజేపీ- వైసీపీల మధ్య అంతర్గత డీల్ జరిగిందని, ఇందులోభాగంగానే పురందేశ్వరి బరిలోకి దిగినట్టు చెబుతున్నారు. వైసీపీ నుంచి రియల్టర్ సత్యనారాయణ బరిలోవున్నారు. జనసేన తరపున మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పోటీలోవున్నా భరత్- పురందేశ్వరి మధ్యే వుంటుంటుని ఎనలిస్టులు చెబుతున్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *