ముందస్తు ఫలితం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కాకపోయినా.. పూర్తిగా కళ తప్పింది. పీసీసీ మాజీ చీఫ్, ప్రస్తుత పీసీసీ చీఫ్ భార్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని పెద్దతలకాయల్ని పోగొట్టుకుంది. కూటమి కట్టినా.. చేతినిండా టిక్కెట్లు దక్కించుకున్నా, పిసరంత గెలుపును కూడా నమోదు చేసుకోలేకపోయిన టీ-కాంగ్రెస్ బాగా చిన్నబోయింది. గాంధీభవన్‌లో ‘స్మశాన వాతావరణం’ నెలకొంది.

 • కోమటిరెడ్డి వెంకట రెడ్డి (నల్గొండ)
 • జీవన్ రెడ్డి (జగిత్యాల)
 • దామోదర రాజనర్సింహ (ఆందోల్)
 • సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్)
 • సంపత్ కుమార్ (అలంపూర్)
 • కొండా సురేఖ (పరకాల)
 • బలరాం నాయక్ (మహబూబాబాద్)
 • పొన్నం ప్రభాకర్ (కరీంనగర్)
 • సుదర్శన్ రెడ్డి (బోధన్)
 • రేవంత్ రెడ్డి (కొడంగల్)
 • జానారెడ్డి (నాగార్జున సాగర్)
 • డీకే అరుణ (గద్వాల)
 • సర్వే సత్యనారాయణ (కంటోన్మెంట్)
 • ముఖేష్ గౌడ్ (గోషామహల్)
 • చిన్నారెడ్డి (వనపర్తి)

అటు.. అధికార తెరాసకు సైతం ఎంతోకొంత డ్యామేజ్ తప్పలేదు. రాష్ట్రం మొత్తం కేసీఆర్ వేవ్ కనిపించినప్పటికీ.. మహాకూటమి నంబర్ గేమ్ కి తెరాసలోని కొన్ని బిగ్ విగ్స్ నేలకూలిపోయాయి. ఓటమి పాలైన సిట్టింగ్ పెద్దలు :

అసెంబ్లీ స్పీకర్

 • మధుసూదనా చారి (భూపాలపల్లి)

మంత్రులు

 • పట్నం మహేందర్ రెడ్డి (తాండూరు)
 • తుమ్మల నాగేశ్వర రావు (పాలేర్)
 • జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)
 • అజ్మీరా చందూలాల్ (ములుగు)

కేసీఆర్ కూడా ఈసారి క్యాబినెట్‌కు సరికొత్త రూపునిచ్చే ప్రయత్నంలో వున్నారు. పాత క్యాబినెట్ నుంచి నలుగురైదుగురు మంత్రుల్ని మాత్రమే తీసుకుని.. మిగతా శాఖలన్నీ కొత్త వాళ్ళకే ఇవ్వాలన్నది కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది. అటు.. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకెళ్లనున్న కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ చీఫ్ పోస్ట్ కోసం మంతనాలు మొదలయ్యాయి. లెజిస్లేటివ్ లీడర్ కుర్చీ కోసం దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోటీ జరిగే అవకాశం వుంది. కానీ.. కాంగ్రెస్ పార్టీలో బాగా ‘సౌండ్’ చేసే సత్తా వున్న నాయకులంతా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వలేకపోవడంతో.. అసెంబ్లీ చప్పగా సాగవచ్చన్నది ఒక అంచనా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *