సిరిసంపదలతో తులతూగుతున్న వాళ్ళు పన్ను తప్పకుండా చెల్లించాల్సిందేనని అంటున్నారు వాల్డ్ లో రెండో అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్. అయితే వాళ్ళు 70 శాతం టాక్స్ చెల్లించాలన్న ప్రతిపాదన మాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ వ్యవస్థాగతమైన మార్పులు అనివార్యమే.. బిలియనీర్ల నుంచి పన్ను వసూలు చేయడంలో తప్పు లేదు..కానీ 70 శాతం అన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను ‘ అని ఆయన ‘ ది లేట్ షో ‘ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

‘ ప్రపంచ వ్యాప్తంగా పన్నుల వ్యవస్థ-బిలియనీర్ల పాత్ర ‘ అన్న అంశంపై డెమోక్రటిక్ సోషలిస్ట్ కాంగ్రెస్ సభ్యురాలైన అలెగ్జాండ్రియా ఒకాసియో అభిప్రాయాల గురించి ప్రస్తావించిన ఆయన.. ఇలా సమాధానమిచ్చారు. ఏడాదికి 10 మిలియన్ డాలర్ల వరకు సంపాదిస్తున్న అమెరికన్లు మార్జినల్ గా 70 శాతం పన్ను కట్టాలన్న ఆలోచన అర్థరహితమని బిల్ గేట్స్ పేర్కొన్నారు. తన భార్య మెలిండాతో కలిసి ఈ షో లో పాల్గొన్న ఆయన..ఈ పన్ను అన్నది ఆర్డినరీ (సాధారణ) ఆదాయం మాత్రమేనన్నారు. ఈక్విటీ ని మరింత పెంచాలంటే కేపిటల్ గెయిన్స్ మీదా, ఎస్టేట్ టాక్స్ మీద దృష్తి పెట్టాలని ఆయన సూచించారు.


పన్నుల వ్యవస్థలో సమూల మార్పులు చేయాలనడం సరైనదేనని, కోటీశ్వరుల నుంచి టాక్సులు రాబట్టడంలో తప్పులేదని ఆయన చెప్పారు. అంతా బాగానే ఉన్నా..ఈ డెబ్బై శాతం అన్నదే కంటిలో నలుసులా కనిపిస్తోందని గేట్స్ అన్నారు. ఒకాసియో వంటి పొలిటిషియన్లు కూడా పాయింట్ మిస్ అవుతున్నారని ఆయన చమత్కరించారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎస్టేట్ టాక్స్, కేపిటల్, సోషల్ సెక్యూరిటీ వంటి అంశాలపై దృష్టి పెడితే మంచిదని కూడా ఆయన సూచించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *