ప్రధాని మోదీపైనా, బీజేపీ పైనా దాదాపు మూడేళ్ళ పాటు విమర్శల దాడులు చేసిన శివసేన.. మళ్ళీ బీజేపీతో జట్టు కట్టబోతోంది.  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని రుజువు చేయనుంది. మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకోవడానికి రంగం సిద్ధమైంది.   బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇద్దరూ సంయుక్తంగా ప్రెస్‌మీట్ పెట్టి తమ  ‘టై-అప్’  గురించి ప్రకటించనున్నారు.
మహారాష్ట్రలో ఈ సంవత్సరాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెరి సగం (50-50) సీట్లను పంచుకుని పోటీ చేయాలని ఈ రెండు పార్టీలూ ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లకు బీజేపీ, 23 స్థానాలకు శివసేన పోటీ చేయవచ్చు. యూపీ తరువాత పార్లమెంటుకు ఎన్నికైన ఎక్కువమంది ఎంపీలు మహారాష్ట్రకు చెందినవారే.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *