బీజేపీ 'బలుపు' ముందు అమెజాన్ అవుట్!

బీజేపీ 'బలుపు' ముందు అమెజాన్ అవుట్!

కేంద్రంలో పవర్లో వున్న బీజేపీ.. ప్రచారం కోసం ఖర్చు పెట్టడంలో కూడా పవర్ ఫుల్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు టెలివిజన్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు కమల నాథులు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్, ట్రివాగొ లాంటి గ్లోబల్ అడ్వర్టయిజర్స్ ని సైతం బీజేపీ వెనక్కు నెట్టేసినట్లు తాజా BARC (బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) రిపోర్ట్ తేల్చేసింది. ఈ విషయాన్ని ఆలిండియా కాంగ్రెస్ పార్టీ తన ప్రచారానికి వాడుకోవడం మొదలుపెట్టింది.

అమెజాన్, హిందూస్తాన్ లీవర్ లాంటి కంపెనీల్ని సైతం దాటెయ్యడంతో పాటు.. నార్తిండియాలో బాగా పేరున్న విమల్ పాన్ మసాలా కంటే ముందు వరసలో నిలబడింది బీజేపీ. గత వారంలో ప్రచార ప్రకటనల విషయంలో అన్ని టెలివిజన్ ఛానల్స్ లో కలిపి బీజేపీ నెంబర్1 గా నిలిచిందని, టాప్10 అడ్వర్టయిజర్స్ లో కాంగ్రెస్ పార్టీకి కనీసం చోటే దొరకలేదని BARC చెబుతోంది. ఉత్తరాది ఎన్నికలకు సంబంధించి బీజేపీ క్యాంపైనింగ్ యాడ్ ఒక్క వారంలో ఏకంగా 22 వేల 99 సార్లు ప్రసారం అయింది. బీజేపీ సమర్పించుకున్న సొమ్ముతో టీవీ ఛానల్స్ అన్నీ పండగ చేసుకున్నట్లే లెక్క!
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *