కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ, ఆయన హెలికాఫ్టర్‌లో భారీ బ్లాక్ బాక్సుని తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తులు దాన్ని మోసుకుంటూ వెళ్లి ఓ కారులో పెట్టారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కారు ఎక్కడికి వెళ్లిందనేది సస్పెన్స్. ఈ పెట్టెలో భారీ ఎత్తున డబ్బులు తెచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రధాని నోరు విప్పాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

మోదీ చాపర్‌కు రక్షణగా మరో మూడు చాపర్లు అక్కడికి వచ్చాయని, అవి ల్యాండయిన తర్వాత ఓ చాపర్ నుంచి ఈ పెట్టెను దించి తీసుకెళ్లారని ఆరోపించారు నేతలు. ఇన్నోవా కారు ప్రధాని కాన్వాయ్ కి సంబంధించినది కాదని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న మోదీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *