మోసం అని రాసి లెటర్ పోస్ట్ చేస్తే అది చంద్రాబు నాయుడు అడ్రస్ కిపోతుందన్నారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. లోకేష్ బాబు మిడిమిడి జ్ణానంతో మోదీకి సినిమా చూపిస్తామంటున్నారని .. అతను మాట్లాడితే థియేటర్లీ మూసుకోవాల్సిన కామెడీ సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కర్నాటకలో బుద్దిచెప్పామని చెబుతున్న లోకేష్ బాబూ.. మీరు కర్నాటకలో వార్డు మెంబర్ గా నైనా పోటీచేశారా? 13 జిల్లాల్లో ఉన్న మీ పార్టీ ఎంత అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు సహా అతని పార్టీ నేతలు దోచుకుని ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు సమకూర్చుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంలపై అనుమానాలున్నాయని అంటున్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంల మీద ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఓటమికి ముందే బాబు అస్త్రసన్యాసమా అని ఆయన అన్నారు. ఈబీసీ రిజర్వేషన్లు మోదీ సర్కారు తీసుకొస్తే.. అందులో ఐదు శాతం కాపులకు ఇస్తానడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ఒక్క మంత్రి పదవికోసం కాల్వ శ్రీనివాసులు మొత్తం వడ్డెర జాతికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *