విశాఖ నార్త్ నియోజకవర్గంలోని కొండలపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు కన్ను పడిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. అందుకే ఆయన నార్త్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. ఒకవేళ ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని సర్వేల్లో తేలితే ఇప్పటికిప్పుడు గంటా ఆ పార్టీలో చేరిపోతారని విష్ణుకుమార్ రాజు సెటైర్ వేశారు. విశాఖలో ఆదివారం మీడియాతో  మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో గంటా తన చేతిలో చిత్తుగా ఓడిపోతారని పేర్కొన్నారు. దేశ ప్రజలు ప్రధాని మోదీకి తిరిగి అధికారం అప్పగించడం ఖాయమని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *