గోషామహల్ బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కరడు గట్టిన హిందుత్వ వాది. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా ఒప్పుకుంటారు. ముస్లిం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోనంటూ మొండికేసినప్పుడే రాజాసింగ్ వైఖరేమిటో దేశం మొత్తం చూసింది. తాజాగా మరోసారి నేషనల్ మీడియాను ఎట్రాక్ట్ చేసుకున్నాడు రాజాసింగ్. శ్రీరామనవమి సందర్భంగా సొంత గొంతుతో పాడిన పేట్రియాటిక్ సాంగ్.. ఇప్పుడు ఇండియాతో పాటు బార్డర్లు దాటి పాకిస్తాన్‌ని కూడా తాకింది.

అయితే.. పాకిస్తాన్ మాత్రం ఈ పాటను మరింత నిశితంగా పరిశీలించి.. ”ఇది మా పాట బాసూ.. కాపీ కొట్టినందుకు కృతజ్ఞతలు” అంటూ ఎకసెక్కం ఆడారు పాకిస్తాన్ సాయుధ బలగాల అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్.

మార్చి 23న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాక్ ఆర్మీ రూపొందించి పాక్ జాతికి అంకితమిచ్చిన పాటను పోలి ఉందట రాజాసింగ్ పాట. ‘నా పాటను పాకిస్తాన్ మీడియా కూడా కవర్ చేస్తున్నందుకు ధన్యుడిని’ అంటూ రాజాసింగ్ కూడా బదులిచ్చాడు.

దీన్ని కూడా ఎగతాళి చేసిన పాక్ పెద్దమనిషి.. మీరు చేసిన ‘గొప్ప పనికి’ ఆ మాత్రం గుర్తింపు రావాలి కదా అన్నారు. రాజాసింగ్ పాడిన ‘హిందూస్తాన్ జిందాబాద్’ పాట ఈ విధంగా పాకిస్తాన్ దాకా పాకేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *