జగన్ పై దాడి కేసులో ఎన్ ఐ ఏ విచారణ అనగానే ఏపీ సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దేశంలో ఎక్కడైనా విచారణ చేపట్టే అధికారం ఈ సంస్థకు ఉందని ఆయన పేర్కొన్నారు. కిదారి కేసులో ఎన్ ఐ ఏ విచారణను స్వాగతించిన మీరు..జగన్ మీద దాడి కేసులో ఈ  దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ఢిల్లీ లో ప్రశ్నించారు.

చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది. అధికారం చేజారిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. అని జీవీఎల్  వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాబు స్వయం కృషితో ఎదగలేదని, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో  టీడీపీ పతనం మొదలైందని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *