పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ 2 చేస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ భారత్ కు మద్దతు పలికాయంటే అది ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వపటిమేనన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే, మరోపక్క దౌత్యచాకచక్యంతో భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపక్షాలూ రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు జీవీఎల్. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలన్ని జీవీఎల్ తీవ్రంగా ఖండించారు.

పీకే అనగానే మనమంతా పవన్ కల్యాణ్ అనుకుంటున్నామని.. కానీ పాకిస్థాన్ లో మాత్రం ఆయన మన మనిషే అని ప్రజలు అనుకుంటున్నారంటూ పవన్ మీద సెటైర్లు వేశారు జీవీఎల్. అంతర్జాతీయ కోడ్ లో పాకిస్థాన్‌ను పీకే అని పిలుస్తాంటూ ఆయన చెప్పారు. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశమంతా ఆయనకు చీవాట్లు పెట్టిందని… ఇటీవలికాలంలో చిన్నహీరో శివాజీతో చంద్రబాబు ఇలాంటి మాటలు చాలాచాలా చెప్పించారంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు. దీంతో ఆయన కొత్త బ్రహ్మంగారిలా తయారయ్యాడన్నారు. ఇలాఉంటే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ జనసేన పార్టీ పవన్ మాట్లాడిన మాటల వీడియోని రిలీజ్ చేసింది.

ఏపీకి రైల్వే జోన్ ఇవ్వబోతోన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు కేవలం ఓట్లకోసం రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు తెలియకుండానే రైల్వేజోన్ విషయంలో చంద్రబాబు లొల్లి రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైల్వే జోన్ వల్ల రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటే, చంద్రబాబు మోదీ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారం కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని పెద్దఎత్తున ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవపట్టించాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ప్రజలు తగిన బుద్దిచెబుతారని ఆయన అన్నారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *