పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు దేశమంతా సంతాపం తెలుపుతుంటే.. ఓ బీజేపీ ఎంపీకి మాత్రం ఇదేదో తమాషా వ్యవహారంలా  కనిపించినట్టు ఉంది. మృతుల్లో ఒకరైన జవాను అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన..నవ్వులు చిందిస్తూ పోజులిచ్చాడు. ఆయనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాక్షి మహారాజ్ ! పుల్వామా టెర్రరిస్టు ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన అజిత్ కుమార్ అనే జవానుకు ఉన్నావ్‌లో నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాగా..అజిత్ భౌతిక కాయం ఉంచిన వాహనంపై నిలబడ్డ స్థానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారిని చూసి చేతులూపుతూ, నవ్వుతూ ‘ అభివాదం ‘ తెలపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

అతని అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను కొందరు పోస్ట్ చేశారు. ఒక జవాన్ అంతిమ యాత్రను ఈయన ‘ అభినందన యాత్ర’గా ఫీలవుతున్నట్టు కనిపిస్తోందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఎంపీ చర్య సిగ్గుమాలిన చేటని మరికొందరు ఈసడించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *