తెలంగాణా అసెంబ్లీ ఎనికల్లో బీజేపీ అభ్యర్థి ఒకే ఒక్కరు గెలిచారు. ఈ ఎలక్షన్స్ లో కనీసం పది సీట్లనైనా సాధిద్దామనుకున్న ఈ పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. గత ఎన్నికల్లో అయిదు చోట్ల గెలుపొందిన బీజేపీ..ఈసారి ఒకటి మినహా మిగతా నియోజకవర్గాలను గెలుచుకోలేకపోయింది. ఈ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఓటమి చవి చూశారు.

గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి ముఖేష్ గౌడ్‌పై ఆయన గెలుపొందారు. ముషీరాబాద్‌లో లక్ష్మణ్ తన సమీప తెరాస అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోగా, అంబర్ పేటలో కిషన్ రెడ్డి… టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోయారు. ఖైరతాబాద్‌లో తెరాస క్యాండిడేట్ దానం నాగేందర్ సమీప బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డిని ఓడించారు. ఉప్పల్‌లో కూడా బీజేపీ క్యాండిడేట్ ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్ ఓటమి చవిచూశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *