గోవా కొత్త సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ బాధ్యతలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటలకు ఆయన చేత  ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. అంతకుముందు ఆయన స్పీకర్‌‌గా పనిచేశారు. పారికర్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11 మంది మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు. మనోహర్ ప్లేస్‌లో గోవా సీఎం ఎవరైతే బాగుంటుందనే మల్లగుల్లాలు పడింది బీజేపీ. మిత్రపక్షాల మధ్య ఆదివారం రాత్రి నుంచి విస్తృతస్థాయిలో చర్చలు చేసింది.

చివరకు సౌమ్యుడిగా పేరుపొందిన ఆయుర్వేద ప్రాక్టీషనర్, స్పీకర్ ప్రమోద్ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. గోవాకు 13వ సీఎం సావంత్‌. మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) అధినేత విజయ్‌ సర్దేశాయ్‌, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ) ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్‌కు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *