బ్రిటిష్ ఆర్మీలో దుర్మార్గపు రేసిజం పోకడలకు వ్యతిరేకంగా పోరాడి నెగ్గాడో బ్లాక్ సోల్జర్. అతడి నల్లని శరీరమే అతనికి వరమైంది. అతని పేరు ఇనోక్ మొమొనాకయా. బ్రిటిష్ సైనికదళంలో లాన్స్ కార్పొరల్ స్థాయి అధికారి. కానీ అతడ్ని సాధారణ సైనికునికన్నా హీనంగా చూశారు అధికారులు. సోల్జర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే వీడియోలో అతడిని తాలిబన్ టెర్రరిస్టు పాత్రలో చూపుతూ హేళన చేశారు.

ఇరాక్, ఆఫ్గనిస్తాన్ లలో పని చేసిన ఫిజీ దేశస్థుడైన ఇనోక్.. తనకు బ్రిటిష్ అధికారులనుంచి ఎదురైన దారుణమైన చేదు అనుభవాలను, వేధింపులను వివరించాడు. నల్లవాడంటూ తనను ఎగతాళి చేసినందుకు, బ్లాక్ బాస్టర్డ్ అంటూ రకరకాలుగా దూషించినందుకు ఎన్నోసార్లు బాధ పడ్డానని, ఒక దశలో ఓ తాడు తెచ్చి..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని ఇనోక్ వెల్లడించాడు. ఆర్మీలోని సీనియర్ అధికారులు తనపట్ల చూపిన నిరాదరణను, రేసిజాన్ని సవాలు చేస్తూ ఆరేళ్ళ పాటు న్యాయ పోరాటం చేశాడు. చివరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇతని ‘ ఆవేదన ‘ ను ఆలకించింది. ఇనోక్ అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా 4 లక్షల 90 వేల పౌండ్లను చెల్లించాలని అర్మీని ఆదేశించింది. సైనిక దళాల్లో జాతి వివక్షా ధోరణికి ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం పొందడం ఇదే మొదటిసారి.

డ్యూక్ ఆఫ్ ల్యాన్ కాన్సర్ రెజిమెంట్ లోని సెకండ్ బెటాలియన్ లో సాధారణ సైనికులను అధికారులు ఎంత హీనంగా, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా చూస్తారో తన అనుభవాలే నిదర్శనమని ఇనోక్ అంటున్నాడు. సైకలాజికల్ గా నేను బాధ పడని రోజంటూ లేదు. నా యూనిట్ లోని ఇతర కామన్వెల్త్ సోల్జర్స్ కూడా నాలాగే రేసిజాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఆయన తెలిపాడు. తన మానసిక బాధ గురించి ఇంటర్నల్ ఆర్మీ వాచ్ డాగ్ లోని సర్వీస్ కంప్లయింట్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా..తన కేసును డిస్మిస్ చేశారని, దాంతో తాను లీగల్ గా వెళ్ళాల్సి వచ్చిందని అయన పేర్కొన్నాడు. కాగా-సాయుధ దళాల్లో జాతి వివక్షకు ఆస్కారం లేదని, దీన్ని సహించబోమని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *