గోదావరిలో మునిగిపోయిన లాంచీ.. 40 మంది పైగా మృతులు ?

రాజమండ్రి గోదావరి నదిలో భయకరమైన సుడిగాలిలో చిక్కుకుని ఓ లాంచీ మునిగిపోయింది. ప్రమాద సమయంలో అందులో 60 మంది గిరిజనులు ప్రయాణిస్తున్నారు. 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు రాగా, 40 మంది గల్లంతు అయినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వీళ్లంతా బోటుపై సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బోటు.. లక్ష్మీ వెంకటేశ్వర సర్వీస్‌కు చెందినది. దీని ఓనర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు వద్ద ఈ ఘటన జరిగింది. కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వైపు ఈ బోటు వస్తుండగా భయంకరమైన సుడిగాలి వెంటాడింది. దీంతో లాంచీ అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు గజ ఈతగాళ్లకు ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇదిలావుంటే నాలుగురోజుల కిందట గోదావరిలో మరో ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బోటు భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మరోవైపు బోటు మునిగిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.