రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఇప్పటిదాకా దాదాపు అరడజను సార్లు ప్రకటించారు అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన సన్యాసం మాటేమో గాని ఆయన కొడుకు అరంగేట్రం మాత్రం తప్పదని తేలిపోయింది. తాడిపత్రి సీటు తనదేనంటూ తొడ గొట్టి చెబుతున్నారు దివాకర్ కొడుకు జేసీ పవన్ రెడ్డి. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న పవన్.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వరన్న అనుమానమే అవసరం లేదంటున్నారు. ‘జిల్లాలోని ప్రతీ గల్లీ తిరిగా.. నాలుగేళ్ల నుంచీ జనంతో టచ్‌లో వున్నా.. నాకేంటి తక్కువ’ అన్నది పవన్ ధీమా. ఇప్పటికే నారా లోకేష్‌తో కంటిన్యువస్ గా టచ్‌లో వున్నారాయన.

ఒక చేత్తో వ్యాపారం, మరోచేత్తో రాజకీయం.. సమాంతరంగా నడిపించుకుంటూ వస్తున్న జేసీ పవన్ రెడ్డి.. రాజకీయాల్లో రాణించాలంటే ఏమేం లక్షణాలుండాలో అన్నిటినీ ఒంటబట్టించుకుంటున్నాడు. గతంలో వైసీపీ అధినేత జగన్‌తో సాన్నిహిత్యం కలిగిఉన్నప్పటికీ.. తాను ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, తెలుగుదేశం తరపున గెలిచి తీరుతానని ఒక ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు.

అనంతపురం మీద పవన్ కళ్యాణ్ స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టడం వల్ల మీ ఉనికికి ఏమైనా ప్రమాదం ఉందా అని అడిగితే.. సినిమా కరిష్మా విషయంలో తాను కూడా ఏమీ తక్కువ కాదని బదులిచ్చారు. ఇక్కడ రానా నుంచి అక్కడ సల్మాన్ ఖాన్ దాకా తనకు పరిచయస్తులేనన్నారు. అనంతపురం వచ్చి ఒకరోజు తనకోసం ప్రచారం చేసిపెడతానని సల్మాన్ ఖాన్ మాటిచ్చారని చెప్పుకొచ్చారు. ‘అనంతపురం కింగ్ డమ్’గా చెలామణీ అవుతున్న జేసీ సామ్రాజ్యానికి సరైన వారసుడిగా ప్రూవ్ చేసుకుంటానన్నది పవన్ రెడ్డికున్న భరోసా!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *