అవును.. సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ నెత్తీనోరూ బాదేసుకుంటున్నాడు. తాను చెప్పకుండా తన సినిమా టైటిల్ ఫలానా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోతున్నాడు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మురుగదాస్ తీయబోయే తర్వాతి సినిమా పేరు ‘నార్కలి’ అనే వార్త ఇప్పుడు సౌతిండియన్ సెల్యులాయిడ్‌పై హల్చల్ చేస్తోంది. కానీ.. ‘నేను ఇప్పటివరకూ పేరు నిర్ధారణ చేసుకోలేదు. ఇటువంటి రూమర్లను నిలిపేయండి’ అంటూ ట్విట్టర్ ద్వారా వేడుకున్నాడు దర్శకుడు మురుగదాస్.

మహేష్‌బాబుతో తీసిన ‘స్పైడర్’.. తర్వాత విజయ్ హీరోగా చేసిన ‘సర్కార్’ సినిమాలు చప్పటి ఫలితాన్నిచ్చినప్పటికీ.. మురుగదాస్ బ్రాండ్ వ్యాల్యూ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా చేయబోయే 166వ మూవీకి సంతకం చేశాడు మురుగ. ఇందులో రజనీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో నటించబోతున్నారన్నది మరో కీలక అంశం. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో మురుగదాస్ మార్క్ ‘పొలిటికల్ టచ్’ వున్న మూవీతో జనంలో క్రేజ్ పొందాలన్నది రజనీకాంత్ ప్లాన్.

గతంలో అర్జున్ హీరోగా వచ్చిన ‘ముదల్వన్’ (తెలుగులో ఒకేఒక్కడు) కోసం డైరెక్టర్ శంకర్ రజనీకాంత్‌ని అడిగితే.. ‘పొలిటికల్ కంటెంట్ ఎక్కువగా వుంది.. నాకొద్దు’ అంటూ తిరస్కరించాడు రజనీ. ఇప్పుడు మురుగదాస్ మళ్ళీ ‘ముఖ్యమంత్రి’ కుర్చీని ఆఫర్ చేయడంతో.. అవసరార్థం రజనీ సరేనన్నారట! ‘2. ఓ’ నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బేనర్ మీదనే మురుగదాస్-రజనీ కాంత్ మూవీ రాబోతోంది. మిగతా విషయాలేవీ అఫీషియల్‌గా వెల్లడి కాలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *