ఆ అన్నాచెల్లెళ్ళ దుస్థితి చూసి అంతా అయ్యోపాపం అంటున్నారు. కారణం.. ఇంకా వయసులో ఉండగానే వారి తలవెంట్రుకలు ముగ్గుబుట్టులా నెరసిపోయాయి. పళ్ళు ఊడిపోగా, ఎముకల పటుత్వం తగ్గి, శరీరం మీది చర్మం ముడుతలు పడిపోయింది. ముసలివారిలా కనిపిస్తున్నారు. ‘ బెంజమిన్ బటన్ ‘ అనే అరుదైన వ్యాధి సోకి వీళ్ళు ఇలా మారిపోయారు. ఆ అన్న పేరు మిషెల్..వయస్సు 20 ఏళ్ళు. చెల్లెలు యాంబర్..వయస్సు 12 సంవత్సరాలు. కానీ తమ వయస్సు కన్నా పదిరెట్లు ఎక్కువ వయసున్నవారిగా కనిపిస్తుంటే..వాళ్ళ స్నేహితులు ఆట పట్టిస్తున్నారు.ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి అరుదైన వ్యాధి సోకుతుందట. ఈ డిసీజ్ తో చాలామంది 12 ఏళ్ళ వయస్సు వచ్చేసరికే మరణించారు.
కానీ ఈ అన్నా చెల్లెళ్ళు మాత్రం తమ బాధలు ఒకరికొకరు చెప్పుకుంటూ..బతుకుబండి నెట్టుకొస్తున్నారు. పైగా వీరి ఆత్మవిశ్వాసం కూడా వీరిని ముందుండి  నడిపిస్తోంది. రేసుల్లో పాల్గొనడమంటే ఇప్పటికీ మిషెల్‌కు సరదా..అలాగే యాంబర్‌కి డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ.. ఏమైతేనేం ? వీరి పేరెంట్స్ తమ పిల్లల్ని ఎంతో గారాబంగా చూసుకొంటున్నారు. వారి  ‘ప్రోజీరియా’  (జన్యుపరంగా సంక్రమించే వ్యాధి) కి అవసరమైన మందులు ఇస్తూ..వారి ఆహారం, ఇతరాల పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నారు. అదే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ కి శ్రీరామ రక్ష.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *