సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తాజాగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రధయాత్రకు న్యాయస్థానం షాకిచ్చింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రధయాత్రకు కోల్‌కతా హైకోర్టు అనుమతి నిరాకరించింది. బెంగాల్‌ అంతటా సాగే ఈ ర్యాలీని షా శుక్రవారం ప్రారంభించాల్సి వుంది. మమతా సర్కార్ ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బెంగాల్‌ బీజేపీ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. డిసెంబర్‌ ఏడు నుంచి బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు ర్యాలీలు చేపట్టేందుకు తాము దరఖాస్తు చేసుకున్నామని దీన్ని ప్రభుత్వం నిరాకరించిందని పేర్కొంది.

కూచ్‌బెహర్‌ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఆ తరహా ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని మమతా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో రథయాత్రకు బ్రేక్ పడింది. ఇదిలావుండగా ఈనెల 21లోగా ఓ నివేదిక సమర్పించాలని జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9న చేపడతామని తెలిపింది. అప్పటివరకు రధయాత్రను వాయిదా వేస్తున్నట్టు బీజేపీ తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *