మహేష్ సినిమాకు సెంటిమెంట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న మహేష్ 25 వ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుందని లేటెస్ట్ న్యూస్.. అంటే.. రాం చరణ్ 12 వ మూవీ, బాలయ్య ఎన్టీఆర్ బయో-పిక్ సంక్రాంతికి రిలీజయితే.. వాటితో మహేష్ సినిమా క్లాష్ కానట్టే.. ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, షెడ్యూల్స్‌ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్‌లు ఏప్రిల్ 5 నే విడుదల చేయాలన్న యోచనలో ఉండగా.. సూపర్ స్టార్‌కు ఏప్రిల్ సెంటిమెంట్ కూడా ఉందన్న ప్రచారమూ ఉంది. అందుకే ఆ నెలను సెలెక్ట్ చేశారట. భరత్ అనే నేను, గతంలో.. పోకిరి సినిమాలు ఇదే నెలలో విడుదలై బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.