వైఎస్ వివేకానంద హత్యను విశాఖ ఎయిర్ పోర్ట్ కోడికత్తి ఘటనతో పోలుస్తూ ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీని దుయ్యబట్టారు. నిజానికి వివేకానందరెడ్డి చనిపోయారన్న వార్త తనను బాధించిందని, కానీ వైసీపీ ఆయన మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడ్డం దారుణమని విమర్శించారు. ఘటన అనంతర పరిణామాలపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని, విశాఖలో జగన్ పై జరిగిన దాడిని కూడా ఇలాగే చిలువలు పలువలు చేసి.. చివరకు ఏమీ తేల్చలేదని ఎద్దేవా చేశారు.

సీఐ ఘటనాస్థలానికి వెళ్లేసరికి రక్తాన్ని తుడిచేశారన్నారు. శవాన్ని తరలించడం, రక్తాన్ని శుభ్రపరచడంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముందుగా హత్య జరిగిందన్న విషయాన్ని వాళ్ళే దాచిపెట్టారని, ఆస్పత్రికి వెళ్లి గుండెపోటు అని చెప్పారని, తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చివరికి తెలుగుదేశం పార్టీని నిందించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు.. వివేకాని ఎవరు చంపారు, ఎలా చంపారన్న విషయం దర్యాప్తులో తేలుతుందని, అంతవరకూ ఓపికతో ఉండాలని చెప్పారు. ఇటు ”డ్రైవర్ ప్రసాద్ ని వదిలిపెట్టొద్దు” అంటూ చనిపోతున్న సమయంలో వివేకా రాసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *