ఏపీకి ప్రత్యేక హోదా మీకు  బోరింగ్ అంశంగా కనబడుతోందా అని వైసీపీ పై  మండిపడ్డారు సిఎం చంద్రబాబు. హోదా అన్నది బోరింగ్ సబ్జెక్ట్ అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యను ఆయన తప్పు పడుతూ.. ఇలాంటి వారిని ఎంపీలుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రయోజనం కోసమే వైసీపీ ఎంపీలు గతంలో రాజీనామాలు చేశారని, ఎన్నిక రాకుండా చూసి రాజీనామా డ్రామాలాడారని చంద్రబాబు ఆరోపించారు. కాగా-సిఐఐ  సదస్సులో తను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, హోదా  బోరింగ్ అన్న అర్థంతో తాను మాట్లాడలేదని  పీవీపీ పేర్కొన్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *