సినీనటుడు అక్కినేని నాగార్జున.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమన్నారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. నేరాలు.. వాటి ద్వారా కలిగే లబ్ధే ఇప్పుడు జగన్ పార్టీకి దొరికిన రాజకీయమని చంద్రబాబు అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 20… సరిగ్గా ఈ రోజుకు ఏపీకి కేంద్రం ద్రోహం చేసి 5 ఏళ్లు అయ్యిందని చంద్రబాబు అన్నారు. నమ్మక ద్రోహానికి ఐదో వార్షికానికి నిరసనలు జరపాలని సూచించారు. రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని బాబు తేల్చిచెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *