ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు . ఏపీలోని 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రేపుతూ తమ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్శిటీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు ప్రసంగానికి ముందు పార్టీ కీలక, స్థానిక నేతలు తమ ప్రసంగాల్ని కొనసాగించారు. టీడీపీ విజయానికి ప్రజలంతా సహకరించాలని.. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని నిలపాలని ఓటర్లను అభ్యర్థించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *