అవునా..ఇది నిజమా? లోకేష్ ఓడిపోవాలని సాక్షాత్తూ తండ్రి.. టీడీపీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు ఎందుకు కోరుకుంటారు? ప్రత్యక్ష ఎన్నికలబరిలో మొట్టమొదటిసారి నిలబడ్డ లోకేష్ గెలవకూడదని ఎందుకు తలపోస్తారు? అన్న ఆశ్చర్యం అందరిలోనూ కలుగకమానదు. అయితే, దీనికి వైసీపీ మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పే ముక్తాయింపు వేరే విధంగా ఉంది. చంద్రబాబు.. లోకేష్ బాధ నుంచి తప్పించుకునేందుకే మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నారని ఆళ్ల చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి మంగళగిరి నుంచి చంద్రబాబు పోటీ చేయాలనుకున్నారని.. ఓటమి భయంతో ఆయన బరిలోకి దిగడానికి వెనకడుగు వేశారన్నారు.

లోకేష్‌ను భరించలేకపోతోన్న చంద్రబాబు పనిలోపనిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోతే దరిద్రం పోతుందని చంద్రబాబు భావించారని చెప్పుకొచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆర్కే చంద్రబాబు, లోకేష్‌లపై సెటైర్లు గుప్పించారు. వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పి.. ఓ మనిషిని రాజకీయంగా హత్య చేస్తే పరవశించి పోతున్నాననే వ్యక్తిని బాబు ఎలా భరిస్తారని ఆళ్ల చెప్పుకొచ్చారు. మంగళగిరి నుంచి పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతమంటున్న లోకేష్.. ఆ పదానికి అర్థం తెలుసుకోని మాట్లాడితే మంచిదని ఆళ్ల సెటైర్లు వేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *